Politics

రాష్ట్రం సృష్టించిన సంపదను ఆవిష్కరిస్తాం!

రాష్ట్రం సృష్టించిన సంపదను ఆవిష్కరిస్తాం!

తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ (Telangana) ప్రగతి ప్రస్థానం.. దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) అన్నారు. రాత్రి-పగలూ తేడా లేకుండా చెమటోడ్చి తెలంగాణను నిర్మించామని.. రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదన్నారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపే ప్రయత్నం చేస్తూ, అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోబోమని కేటీఆర్‌ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే తొమ్మిదిన్నరేళ్ల భారాస పాలనపై ‘స్వేదపత్రం’ పేరిట శనివారం తెలంగాణ భవన్‌లో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. గణాంకాలతో సహా.. వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించనున్నట్లు చెప్పారు. అప్పులు కాదు.. రాష్ట్రం సృష్టించిన సంపదను ఆవిష్కరిస్తామన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z