Politics

పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రముఖులు

పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రముఖులు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao)వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని ‘పీవీ జ్ఞానభూమి’ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. పీవీ సమాధి వద్ద గవర్నర్ తమిళిసై (Tamilisai Soundararajan), సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) నివాళులు అర్పించారు. ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. జాతి గర్వించదగ్గ మహనీయుడు పీవీ అని కొనియాడారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z