శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివెళ్తున్నారు. ఎరుమేలికి నాలుగు కిలోమీటర్ల ముందే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి భక్తులు అవస్థలు పడుతున్నారు. కొందరు ఎరుమేలి నుంచి శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్నారు. శబరిమలలో స్వామి వారి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతోంది. మాలధారణలో ఉన్న చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
👉 – Please join our whatsapp channel here –