ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన కొనసాగుతోంది. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో రెండో రోజు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024, ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై ఈసీ బృందం రెండో రోజు సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల అధికారులు, ఎస్పీలు, కలెక్టర్లతో బృందం చర్చలు జరుపుతోంది. ఓటర్ల జాబితా, పోలింగ్ సన్నద్ధత, ఇతర అంశాలపై చర్చిస్తోంది. తొలి రోజు శుక్రవారం 18 జిల్లాలపై సమీక్ష పూర్తికాగా.. ఇవాళ మరో 8 జిల్లాలపై ఈసీ బృందం సమీక్షిస్తోంది. చెక్‌పోస్టులు, తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై ఆరా తీస్తోంది.
సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో భద్రత ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు ఈసీ బృందం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఎక్కువగా ఉన్న జిల్లాలపై ఎలాంటి పర్యవేక్షణ ఉండాలన్న దానిపై సీఈవోకు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఈసీ బృందం ప్రత్యేకంగా భేటీ కానుంది.
👉 – Please join our whatsapp channel here –