నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్‌లు, ఓలా, ఉబర్, ఆటో డ్రైవర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడున్నర లక్షల మంది గిగ్ వర్కర్లు (ఆన్‌లైన్ యాప్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై తాత్కాలికంగా పని చేసే వాళ్లు) ఉన్న నేపథ్యంలో.. సీఎం వారితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎం రేవంత్‌కు ఈ సందర్భంగా గిగ్ వర్కర్లు (Gig workers) విజ్ఞప్తి చేశారు. సీఎంతో పాటు సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –