Kids

ఎలుక కొరకడంతో మృతి చెందిన శిశువు

ఎలుక కొరకడంతో మృతి చెందిన శిశువు

నలభై రోజుల వయస్సు శిశువును ఎలుక కొరకడంతో మృతి చెందిన ఘటన ఇది. నాగర్‌కర్నూల్‌ పట్టణం నాగనూల్‌లోని శివ, లక్ష్మికళ దంపతులకు 40 రోజుల క్రితం మగ శిశువు జన్మించాడు. శనివారం రాత్రి నేలపై తల్లితో నిద్రిస్తున్న చిన్నారి ముక్కును ఎలుక కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. శిశువు ఏడుపుతో అప్రమత్తమై వెంటనే పట్టణ ఆసుపత్రికి తరలించారు. తరువాత నగరంలోని నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం మధ్యాహ్నం చిన్నారి మృతి చెందాడు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z