WorldWonders

ద్వారకాలో 37 వేలమంది మహిళలు శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ మహారాస్‌ నృత్యం

ద్వారకాలో  37 వేలమంది మహిళలు శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ మహారాస్‌ నృత్యం

దేవతల భూమిగా పిలిచే గుజరాత్‌లోని ద్వారకాలో సంప్రదాయ మహారాస్‌ వేడుక అట్టహాసంగా జరిగింది. అహిర్‌ వర్గానికి చెందిన 37 వేలమంది మహిళలు శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ మహారాస్‌ నృత్యం చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించి, శ్రీకృష్ణుడి చిత్రం చుట్టూ వృత్తాకారంలో తిరుగుతూ వీరు చేసిన నృత్యాలు అలరించాయి. సౌరాష్ట్రలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి అహిర్‌ వర్గీయులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఏసీసీ సిమెంట్‌ కంపెనీ ఆవరణలో అఖిల భారతీయ అహిరణి మహారాస్‌ సంఘటన్‌ ఆధ్వర్యంలో ఈ నృత్య వేడుకను నిర్వహించారు. రాక్షస రాజు బాణాసురుడి కుమార్తె ఉషకు గుర్తుగా అహిర్‌ ప్రజలు మహారాస్‌ నిర్వహించుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ధుడి భార్యే ఈ ఉష.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z