వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనదే అధికారమని సినీనటుడు, జనసేన నేత పృథ్వీరాజ్ అన్నారు. అనంతపురంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి 175 సీట్లు వచ్చే పరిస్థితిలేదని చెప్పారు. ఆ పరిస్థితి ఉంటే 92 చోట్ల అభ్యర్థులను మార్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. జనసేన, టీడీపీ కూటమి 135 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. పవన్ కల్యాణ్ ఒప్పుకుంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని చెప్పారు.మంత్రి అంబటిపై పృథ్వీరాజ్ సెటైర్లు వేశారు. మంత్రి అంబటి వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే జబర్దస్త్ షోలకు పనికొస్తారని పృథ్వీరాజ్ ఎద్దేవా చేశారు. మంచి మాట్లాడినా కూడా కొందరు చెడుగా అర్థం తీస్తున్నారని మండిపడ్డారు. ఉపెన, సునామీ వచ్చే ముందు ఎంత ప్రశాంతంగా ఉందో అలా ప్రజలు ఉన్నారని తెలిపారు. టీడీపీ, జనసేన ప్రభుత్వంలో అద్భుతాలు జరుగుతాయని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –