ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ మేరకు సెక్రటేరియేట్‌లో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన కార్యాచరణపై సీఎం రేవంత్‌రెడ్డి కూలంకషంగా చర్చించారు. ఏడో అంతస్తులోని డోమ్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు కూడా హాజరయ్యారు.
👉 – Please join our whatsapp channel here –