DailyDose

కొత్త ఇన్‌చార్జికి రేవంత్ విషెస్-తాజా వార్తలు

కొత్త ఇన్‌చార్జికి రేవంత్ విషెస్-తాజా వార్తలు

* ఏపీ సర్వనాశనమైంది!

వైయస్‌ఆర్‌ సీఎం కాకముందు ఆయన కుమారుడు జగన్‌ ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసని తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkat Ramana Reddy) విమర్శించారు. వైయస్‌ఆర్‌ సీఎం అయ్యాకే జగన్‌ ఎదిగారని చెప్పారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడారు. మనమంతా జగన్‌, షర్మిలకు వైయస్‌ఆర్‌ అంటే ఎంతో ప్రేమ అనుకుంటాం.. కానీ, రాజశేఖర్‌ రెడ్డి చనిపోయాక ఆయన కోసం వైఎస్‌ కుటుంబం ఏం చేసింది?అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో వైకాపా కోసం పనిచేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ తప్పు తెలుసుకొని.. ఏపీ సర్వనాశనమైందని బాధపడుతున్నారని ఆనం చెప్పారు.

*  కొత్త ఇన్‌చార్జికి రేవంత్ విషెస్

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఏఐసీసీ ఇంఛార్జిగా నియమితులైన దీపా దాస్ మున్షికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా ఆమె రాకను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. “మీ అంకితభావం, నిబద్ధతలతో తెలంగాణాలో పార్టీని మరింత బలోపేతం చేస్తారని మేము ఎదురుచూస్తున్నాము. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసిన గత ఏఐసీసీ ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రేకి ధన్యవాదాలు. కొత్త బాధ్యతలు చేపట్టినందుకు ఠాక్రేకి శుభాకాంక్షలు” అని రేవంత్ ట్వీట్ చేశారు.

పులివెందుల నేతలకు జగన్ కీలక ఆదేశాలు

సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలకు సిద్ధమయ్యారు. అటు పార్టీ కేడర్‌ను సైతం రెడీ చేస్తున్నారు. ఈ మేరకు మరింత వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇంచార్జిలను మార్చారు. ఇప్పుడు ప్రాంతాల వారీగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. స్థానక నేతలతో భేటీ అవుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి తెలుసుకుంటున్నారు. గెలుపు ఆవశ్యకతపై వివరిస్తున్నారు. ఎట్టి పరిస్థితిల్లోనూ వచ్చే ఎన్నికల గెలవాలంటూ దిశానిర్దేశం చేస్తున్నారు.తాజాగా కడప జిల్లా ఇడుపులపాయ, పులివెందులలో సీఎం జగన్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అటు కిస్మస్ వేడుకల్లోనూ సీఎం జగన్ పాల్గొన్నారు. అనంతరం పులివెందుల వైసీపీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ స్థానికంగా పర్యటించాలని, ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

వైకాపా పాలనకు చరమగీతం పాడేందుకే తెదేపా-జనసేన పొత్తు!

వైకాపా పాలనపై తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ధ్వజమెత్తారు. వచ్చే మూడు నెలల్లోనైనా ముఖ్యమంత్రి జగన్‌ నిజాయితీగా ఉండకపోతే.. చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీని జగన్‌ అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. ‘‘వైకాపా పాలనకు చరమగీతం పాడేందుకే తెదేపా-జనసేన పొత్తు. తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. జగన్‌ పరదాల చాటున వచ్చి రైతులను పలకరించకుండానే వెళ్లారు. అంగన్వాడీ కేంద్రాలను పట్టించుకున్న పాపాన పోలేదు’’ అని ఆలపాటి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

*  పొత్తులపై జీవీఎల్‌ కామెంట్స్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అంతా ఎన్నికల పొత్తుల గురించే చర్చ సాగుతోంది.. వైసీపీ సింగిల్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధం కాగా.. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. అనూహ్యంగా.. టీడీపీతో జత కట్టింది.. అయితే, బీజేపీ స్టాండ్‌ పై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.. మరోవైపు.. కాంగ్రెస్‌ పార్టీ, లెఫ్ట్‌పార్టీలు.. అంటే ఇండియా కూటమి కలిసే పోటీ చేస్తే ఎలా ఉంటుందనే చర్చలు కూడా సాగుతున్నాయి.. ఇక, బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పొత్తుల అంశం బీజేపీ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్న ఆయన.. ఎన్నికల సందర్భంలో పొత్తులపై నిర్ణయం ఉంటుందన్నారు.. అధికార పార్టీ నేతలు మాపై ఆరోపణలు చేయడం సబబు కాదని హితవుపలికారు. ఏదేమైనా బీజేపీ నిర్ణయం లేటైనా లేటెస్ట్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు జీవీఎల్‌.మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో చర్చగా మారిన టీడీపీ అధినేత చంద్రబాబు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ భేటీపై స్పందించిన జీవీఎల్.. చంద్రబాబు- పీకేని ఎందుకు కలిశారో ఆయన చెప్పాలన్నారు. ఎవరిని ఎవరైనా కలిసే అవకాశం ఉన్నప్పుడు సమావేశం వెనుక కారణాలను సీబీఎన్, పీకే చెబితేనే బాగుంటుంది అన్నారు. అది వారి వ్యక్తిగతం అని కొట్టిపారేశారు. ఇక, స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్ లో నేనే మాట్లాడుతున్నాను.. బయట చాలా అపోహలు ఉన్నాయి.. వాటిని నమ్మల్సిన అవసరం లేదన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగానే జిందాల్ తో ఒప్పందం కుదుర్చుకున్నామనేది అవాస్తవం అన్నారు జీవీఎల్. ప్లాంట్ ని సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. అందుకు అనుగుణంగానే ఒప్పందాలు జరుగుతున్నాయి.. ఇప్పుడు జరుగుతున్న ఒప్పందాలకు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సంబంధం లేదని స్పష్టం చేశారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు.

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఎమ్మెల్యే

సికింద్రాబాద్‌లో ఓ కార్యక్రమానికి వెళ్లిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత లిఫ్టులో ఇరుక్కుపోయారు. ఓవర్‌లోడ్‌ కారణంగా లిఫ్ట్‌ కిందకి వెళ్లిపోవడంతో ఎమ్మెల్యే అందులో చిక్కుకుపోయారు. ఆమె వ్యక్తిగత సిబ్బంది లిఫ్ట్‌ డోర్లు బద్దలుకొట్టి.. సురక్షితంగా బయటకు తీశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z