DailyDose

ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం- నేర వార్తలు

ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం- నేర వార్తలు

* ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. హుజూరాబాద్‌ నుంచి హనుమకొండ (Hanamkonda News)కు వెళ్తుండగా.. ఎల్కతుర్తి శివారులో ఆర్టీసీ (TSRTC) బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. సమీపంలోని పంటపొలంలోకి బస్సు చక్రాలు దూసుకెళ్లాయి. ఈఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును నిలువరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఓవర్‌లోడ్‌ వల్లే బస్సు చక్రాలు ఊడినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులు 80 మంది ఉండగా, పలువురికి స్వల్పగాయాలయ్యాయి.

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం నారాయణ పేట జిల్లాలోని మక్తల్ మండలం జక్లేర్ జాతీయ రహదారిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వారి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. మృతులను కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* గుడివాడలో దారుణం

కృష్ణా జిల్లాలోని గుడివాడలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి పాశవికంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. మహిళను దారుణంగా హత్య చేసిన ఈ ఘటన గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో జరిగింది. భార్య రామలక్ష్మిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు భర్త సూర్యనారాయణ. అడ్డుకోబోయిన రామలక్ష్మి తండ్రి వెంకన్నను కూడా నిందితుడు గాయపరిచాడు.అసలేం జరిగిందంటే.. ఐదేళ్ల క్రితం భీమవరానికి చెందిన సూర్యనారాయణతో గుడివాడకు చెందిన రామలక్ష్మికి వివాహమైంది. పెళ్లైన ఒక సంవత్సరానికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. అనంతరం వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భర్తతో విభేదాల కారణంగా, నాలుగేళ్ల కుమారుడితో కలిసి గుడివాడలోని ఎన్టీఆర్ కాలనీలోని పుట్టింట్లో ఉంటోంది రామలక్ష్మి. భార్యాభర్తల వివాదంపై పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకుందామంటూ సూర్యనారాయణను పిలిపించారు రామలక్ష్మి కుటుంబ సభ్యులు. రామలక్ష్మి ఇంటిలో పనులు చేసుకుంటుండగా భర్త సూర్యనారాయణ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అడ్డం వచ్చిన రామలక్ష్మి తండ్రిని కూడా కత్తితో గాయపరిచాడు. గాయపడిన ఆయనను గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రామలక్ష్మి తండ్రి వెంకన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుడివాడ వన్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మధ్యప్రదేశ్‌లో పట్టపగలే దారుణం

మధ్యప్రదేశ్‌లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. తన సోదరుడి ఆత్మహత్యకు కారణమైందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి మరదలిని సజీవ దహనం చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. రత్లాం జిల్లాకు చెందిన ప్రకాశ్‌ ఆరు నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి భార్య నిర్మల తన ఇద్దరు పిల్లలతో కలిసి అత్తింటి వద్దే నివసిస్తోంది. అయితే.. తన సోదరుడి బలవన్మరణానికి నిర్మలే కారణమంటూ మృతుడి సోదరుడు సురేశ్‌ మొదటి నుంచి ఆరోపిస్తున్నాడు.ఈ క్రమంలోనే శనివారం ఆమెపై రాడ్‌తో దాడికి దిగిన సురేశ్‌.. అనంతరం పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ‘మీ సోదరికి నిప్పంటించాం’ అని అతడే ఫోన్‌ చేసి చెప్పినట్లు నిర్మల సోదరుడు మీడియాతో తెలిపాడు. భర్త చావుకు నా సోదరే కారణమని.. ఆమెను చంపేస్తానని నిందితుడు గతంలో కూడా బెదిరించినట్లు ఆరోపించాడు. దీంతో ఆమెను ఇంటికి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యానని, అంతలోనే ఈ ఘోరం జరిగినట్లు వాపోయాడు. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

* తమిళనాడులో దారుణం

తమిళనాడులో దారుణం జరిగింది. రాష్ట్ర రాజధాని చెన్నై నగర శివారులోని తాలంబూరులో నందిని అనే యువతిని ఆమె ప్రియుడు వెట్రిమారన్ కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం ప్రియురాలి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. మృతురాలు నందిని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగం చేస్తోంది. కాగా, మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రియురాలిపై అనుమానంతోనే వెట్రిమారన్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నారాయణ పేట‌లో ఘోర రోడ్డు ప్రమాదం

నారాయణ పేట జిల్లా‌లో ఘోర ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీ కోట్టుకున్న ఈ ఘటన అయిదుగురు దుర్మరణం చెందారు. 167 జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం మహాబూబ్‌నగర్ 167 జాతీయ రహదారి జక్లేర్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకోట్టుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడక్కడే మృతి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతులపు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z