WorldWonders

ఎద్దుల అస్తికలను గంగానదిలో నిమజ్జనం చేసిన రైతన్న

ఎద్దుల అస్తికలను గంగానదిలో నిమజ్జనం చేసిన రైతన్న

ఎద్దుల పట్ల ప్రేమానురాగాలను అరుదైన రీతిలో చాటుకున్నారు ఇద్దరు రైతులు. రెండు సందర్భాల్లో మరణించిన 4 ఎద్దుల అస్థికలను శాస్త్రోక్తంగా గంగానదిలో నిమజ్జనం చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌ జిల్లా సోరోన్‌లో ఆదివారం జరిగింది. ఈ మేరకు మధ్యప్రదేశ్‌కు చెందిన అన్నదాతలు భవానీ సింగ్‌, ఉల్ఫత్‌ సింగ్‌లు మరణించిన తమ నాలుగు ఎద్దులకు పిండప్రదానం చేశారు. ‘‘మానా, శ్యామా అనే రెండు ఎద్దులను నేను 30ఏళ్లుగా పెంచుతున్నాను. పొలం పనుల్లో సాయంగా ఉండేవి. అందుకే అవి నాకు తండ్రితో సమానం. ఈ నెల 16న అవి చనిపోతే తండ్రికి నిర్వహించినట్లే వాటికీ దహన సంస్కారాలు జరిపాను. తండ్రి అస్థికలకు ఎలా పూజలు చేస్తామో అలాగే వాటి అస్థికలకూ చేశాను. 11 రోజులకు వాటిని గంగానదిలో నిమజ్జనం చేశాను. మంగళవారం 3,000 మందికి నా స్వగ్రామంలో అన్నదానం చేస్తున్నాను’’ అని భవానీ సింగ్‌ తెలిపారు. ఉల్ఫత్‌ సింగ్‌కు చెందిన రెండు ఎద్దులు 8 ఏళ్ల క్రితం ప్రమాదవశాత్తు బండితో సహా బావిలో పడి చనిపోయాయి. ఆయన మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటి నుంచి ఆయన ఎద్దుల అస్థికలను భద్రపరిచారు. తాజాగా ఆదివారం వాటిని గంగానదిలో నిమజ్జనం చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z