Business

పోటాపోటీగా జిఎంఆర్- రిలయన్స్- అదానీ -సీమెన్స్

పోటాపోటీగా జిఎంఆర్- రిలయన్స్- అదానీ -సీమెన్స్

జాతీయ రహదారుల్లో విద్యుత్తు వాహన (ఈవీ) ఛార్జింగ్‌ వ్యవస్థ నెలకొల్పేందుకు జీఎంఆర్‌ ఎనర్జీ, రిలయన్స్‌, సీమెన్స్‌, అదానీ- టోటల్‌ ఎనర్జీస్‌ పోటీపడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో నాలుగు ఎక్స్‌ప్రెస్‌వేలు- బుందేల్‌ఖండ్‌, పుర్వాంచల్‌, అగ్రా-లఖ్‌నవూ, గోరఖ్‌పూర్‌ లింక్‌లపై 26 ఇ- ఛార్జింగ్‌ స్టేషన్‌ల నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసేందుకు ప్రైవేట్‌ కంపెనీల నుంచి బిడ్‌లను యూపీ ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ (యూపీఈఐడీఏ) ఆహ్వానించింది. ఈ గ్రీన్‌ మొబిలిటీ ప్రాజెక్ట్‌ దక్కించుకునేందుకు రిలయన్స్‌, జీఎంఆర్‌, అదానీ, బీఎలక్ట్రిక్‌, లైట్‌జిప్‌ టెక్నాలజీస్‌, ఈవీ ప్లెక్సస్‌, సీమెన్స్‌ సహా దాదాపు డజను సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ ఛార్జింగ్‌ స్టేషన్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం బిడ్డర్‌కు 10 ఏళ్ల లీజు కింద భూమి ఇవ్వనుంది. భూకేటాయింపు తర్వాత ఆరు నెలల్లోగా కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించాలి. అయిదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంలో 5 శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z