Politics

మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు కూడా తెదేపా పూర్తి మద్దతు

మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు కూడా తెదేపా పూర్తి మద్దతు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉద్యమాంధ్రప్రదేశ్‌గా మారిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. సీఎం జగన్‌ పాదయాత్ర సమయంలో ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక అందర్నీ మోసం చేశారని విమర్శించారు. ‘‘ అంగన్వాడీలు, మున్సిపల్‌ కార్మికులు నిరసన చేస్తున్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి ఏర్పడింది. మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు కూడా తెదేపా పూర్తి మద్దతిస్తుంది. అంగన్వాడీల సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా శ్రేణులు మద్దతిచ్చాయి. మున్సిపల్, ఆశా వర్కర్లు కూడా వారికి మద్దతు తెలపాలి’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z