Politics

గత భారాస పాలన అవినీతిమయంగా మారింది!

గత భారాస పాలన అవినీతిమయంగా మారింది!

గత భారాస పాలన అవినీతిమయంగా మారిందని, త్వరలోనే ఆ పార్టీ నేతలు జైలుకెళ్లడం ఖాయమని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండలో ఆయన సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… భారాస త్వరలోనే నాలుగు ముక్కలుగా విడిపోయే అవకాశం ఉందన్నారు.పదేళ్ల పాటు భారాస ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించిందని విమర్శించారు. ప్రభుత్వ శాఖలను అప్పులకుప్పగా మార్చిందని ఆరోపించారు. భారాస ప్రభుత్వం అవినీతిపై ఏర్పాటు చేయనున్న సిటింగ్‌ జడ్జి విచారణ నివేదిక రాగానే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్‌ అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తంచేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z