మొన్నటివరకూ రూ.2వేల నోట్ల రద్దుపై వార్తలు రాగా.. ఇప్పుడు మార్చి 31, 2024 వరకు పాత రూ.100 నోట్లను మార్చుకోవాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఆదేశించిందని ఓ న్యూస్ ప్రచారమవుతోంది. ఈ నోట్లను ఈ తేదీ తర్వాత చట్టబద్ధమైనవిగా అంగీకరించబోమని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ ప్రచారంపై తనిఖీ చేపట్టిన ఫ్యాక్ట్ చెక్.. ఈ వాదన పూర్తిగా అబద్ధమని కొట్టిపారేసింది. ఈ విషయంపై ఆర్‌బీఐ నుండి ఎటువంటి అధికారిక నోటిఫికేషన్ రాలేదని వెల్లడైంది.
ఏం వైరల్ అవుతోంది?
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో @nawababrar131 అనే పేజీలో డిసెంబర్ 20, 2023న ఓ న్యూస్ పోస్ట్ అయింది. ఈ పోస్ట్‌లో పాత రూ. 100 నోటు ఫోటో ఉంది. దాంతో పాటు, ఈ పాత రూ.100 నోటు ఇకపై చెల్లదని, మార్చి 31, 2024 లోపు ఈ నోట్లను మార్చుకోవాలని ఆర్బీఐ వెల్లడించిందని ఉంది. ఈ విషయంపై ఆర్బీఐ వెబ్ సైట్ లోనూ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. విస్తృత తనిఖీ చేపట్టిన ఫ్యాక్ట్ చెక్.. ఎట్టకేలకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ గానీ, ప్రెస్ నోట్ గానీ రిలీజ్ కాలేదని స్పష్టం చేసింది.
👉 – Please join our whatsapp channel here –