సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కార్మికుల వైద్యానికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు, కొత్తగూడెంలో నిర్వహించిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి ఖర్చు లేకుండా కారుణ్య నియామకాలు చేపడతామని చెప్పారు. కార్మికులకు ఇంటిస్థలం, రూ.20 లక్షల వడ్డీలేని రుణం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
‘‘ సింగరేణి దినోత్సవం రోజున సెలవుగా ప్రకటిస్తాం. మహిళా కార్మికులకు గని లోపల కాకుండా ఉపరితలంలో పని చేసే అవకాశం కల్పిస్తాం. కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరిస్తాం’’ అని పొంగులేటి హామీ ఇచ్చారు.సింగరేణి కార్మికుల సొంతింటి కలను నిజం చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పెద్దపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ వేస్తామని, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాన్ని గెలిపించాలని శ్రీధర్ బాబు కోరారు.
👉 – Please join our whatsapp channel here –