* హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీ కొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన హనుమకొండ జిల్లా(Hanumakonda district) హసన్‌పర్తి మండలం బాహుపేట క్రాస్‌రోడ్ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ధర్మసాగర్‌కు చెందిన సోమయ్య(55), సుదర్శన్(58) బైక్‌పై వెళ్తుండగా వీరి వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సోమయ్య, సుదర్శన్ మృతితో ధర్మసాగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* ప్రేమికుడిపై ఓ ప్రియురాలు పగబట్టిన ఘటన
మాజీ ప్రేమికుడిపై ఓ ప్రియురాలు పగబట్టిన ఘటన ఆసక్తిగా మారింది. ఏకంగా కారులో గంజాయి ప్యాకెట్లు పెట్టి మాజీ ప్రియుడ్ని జైలుకు పంపాలని పన్నాగం పన్నింది. పోలీసుల దర్యాప్తులో కథ అడ్డం తిరిగింది. వివరాల్లోకి వెళితే.. కొన్నాళ్లుగా తనను దూరం పెడుతున్నాడని లా స్టూడెంట్ అయిన యువతి తన మాజీ ప్రియుడిపై పగ పెంచుకుంది. ఈ నేపథ్యంలోనే తనను ఎలాగైనా పోలీసులకు పట్టించాలని భావించి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఆ యువకుడి కారులో గంజాయిని పెట్టి, పోలీసులకు ఆమే సమాచారం ఇచ్చి పట్టించేలా చేసింది. విచారణలో యువతే రూ.4 వేలు పెట్టి గంజాయి కొనుగోలు చేసి.. కారులో పెట్టించిందని తేలింది. దీంతో ఆ యువతితో పాటు మరో ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 40 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
* సివిల్ ఇంజినీర్ దుర్మరణం
బైక్(Bike)ను టిప్పర్ ఢీ కొనడంతో ఓ ఇంజినీర్(Civil engineer) దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన పహాడీషరీఫ్ పరిధి ఇమాంగూడ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్‌లోని గుంటి జంగయ్య కాలనీకి చెందిన ఆంజనేయులు ఓ ప్రైవేటు సంస్థలో సివిజ్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. కాగ, తన స్వస్థలం నాగర్ జిల్లా బల్మూరు మండలం కొండనాగుల వెళ్తుండగా ఆంజనేయులు బైక్‌ను టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* టోల్ ప్లాజా వద్ద లారీ బీభత్సం
నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద లారీ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. అనంతరం లారీ టోల్ ప్లాజా కౌంటర్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టోల్ ప్లాజా సిబ్బంది, కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించిన టోల్ ప్లాజా సిబ్బంది.. బాధితులను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కౌంటర్‌లోకి దూసుకెళ్లిన లారీని క్రేన్ సాయంతో తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
* పురుగు మందు తాగి ఓ మహిళ అత్మహత్య
పురుగు మందు తాగి ఓ మహిళ అత్మహత్యకు పాల్పడిన ఘటన చారకొండ మండలం సారంబండతండాలో చోటుచేసుకుంది.హెడ్‌కానిస్టేబుల్ నాగయ్య వివరాల మేరకు.. సారంబడ తండాకు చెందిన వడ్త్యావత్ బుజ్జి (48) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత క్షీణించడంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది.గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలి కుమారుడు నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు.
* మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం పాలైన ఘటన ఇవాళ ఉదయం మధ్యప్రదేశ్‌లోని గుణా జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు కారణంగా స్క్రాప్ లోడ్‌తో ఉన్న లారీ కారును ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించగా.. లారీ అదుపు తప్పి కారుపై పడిపోయింది. ఈ క్రమంలో కారులో ఉన్న ఆరుగురిలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. మృతుల్లో భార్యాభర్తలు వారి కుమార్తెలు ఉన్నట్లుగా సమాచారం. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో నుంచి మృతదేహాలను వెలికితీశారు. అదేవిధంగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
👉 – Please join our whatsapp channel here –