ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 29 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటూ ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశాయి. ఆస్పత్రులకు వెయ్యి కోట్ల రూపాయల వరకు బిల్లులు పెండింగులో ఉన్నాయి. పలు శస్త్ర చికిత్సల ఛార్జ్‌లు పెంచాలని ఎప్పటి నుంచో ఆస్పత్రుల యాజమన్యాలు కోరుతున్నాయి. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో.. ఈ నెల 29 నుంచి సేవలు ఆపుతామని లేఖ రాశాయి.
ఆస్పత్రుల యాజమాన్యాలు అధికారులతో జరిపిన చర్చల్లో డిసెంబర్ 15వ తేదీలోపు అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని.. ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయలేదన్నాయి. దీంతో ఈ నెల 29 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపి వేస్తామని.. అలాగే 29 నుంచి ఆరోగ్య శ్రీ క్రింద రోగులను చేర్చుకోకూడదని నిర్ణయిస్తూ.. ఈ మేరకు ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి లేఖ రాశాయి.
👉 – Please join our whatsapp channel here –