కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. డిసెంబరు 28న మధ్యాహ్నం 12.05 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షా.. అక్కడి నుంచి నేరుగా నోవాటెల్ హోటల్‌కు వెళ్తారు. నోవాటెల్‌లో మధ్యాహ్నం 12.20 గంటల నుంచి 1.45 గంటల వరకు పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. అనంతరం 1.50 గంటలకు కొంగరకలాన్‌లో జరిగే భాజపా రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించడంతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
👉 – Please join our whatsapp channel here –