‘ఇస్మార్ట్ శంకర్’కు కొనసాగింపుగా రామ్ – పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి కనెక్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఇటీవలే ముంబయిలో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కాగా, ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్‌ను మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అది జనవరి తొలి వారం నుంచి ముంబయిలోనే ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో రామ్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలిసింది. మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోన్న ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి మణిశర్మ సంగీతమందిస్తుండగా.. కేచ, రియల్ సతీశ్ స్టంట్ డైరెక్టర్స్‌గా వ్యవహరిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –