DailyDose

నిన్ను చంపడానికి 50 లక్షలు అడ్వాన్స్‌ అందింది!

నిన్ను చంపడానికి 50 లక్షలు అడ్వాన్స్‌ అందింది!

‘నిన్ను చంపడానికి రూ. కోటి ఆఫర్‌ వచ్చింది. ఇప్పటికే రూ.50 లక్షలు అడ్వాన్స్‌ అందింది. నీ గురించి పూర్తి వివరాలు నాకు తెలుసు. నిన్ను త్వరలో చంపేస్తా’ అంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఉప్పరపల్లికి చెందిన స్థిరాస్తి వ్యాపారి సామ దామోదర్‌రెడ్డికి ఫోన్‌ చేసి బెదిరించాడు. దామోదర్‌రెడ్డికి గతంలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేతో స్థలం విషయంలో వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకు బెదిరింపు కాల్‌ రావడంతో సదరు నాయకుడి అనుచరులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై బాధితుడు రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ విషయంపై రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేంద్రబాబు మాట్లాడుతూ.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z