మన అమెరికన్ తెలుగు సంఘం(MATA) ఆధ్వర్యంలో చికాగో, సియాటెల్, బే ఏరియాలో కిక్-ఆఫ్ ఈవెంట్‌లు నిర్వహించారు. చికాగో జరిగిన కిక్-ఆఫ్ ఈవెంట్ కార్యక్రమానికి గౌరవ అతిథిగా కాంగ్రెస్‌మెన్ రాజా కృష్ణమూర్తి పాల్గొన్నారు. సియాటెల్ చాప్టర్ సమావేశంలో ముఖ్య అతిథిగా భారత కాన్సులేట్ జనరల్ ప్రకాష్ గుప్తా, గౌరవ అతిథిగా కాన్సుల్ & హెడ్ ఆఫ్ ఛాన్సరీ సురేష్ కుమార్ శర్మతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నేపథ్య గాయకుడు వేణు శ్రీరంగం ప్రత్యక్ష సంగీత విభావరి అలరించింది. మిస్ టీన్ ఇండియా వాషింగ్టన్ విజేత శ్రియా గడ్డం పాల్గొని సందడి చేశారు. బే ఏరియా చాప్టర్ కిక్-ఆఫ్ ఈవెంట్ డబ్లిన్ Blvdలోని పీకాక్ బాంక్వెట్ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘మాటా’ బే ఏరియా సభ్యులు పాల్గొన్నారు.
మాటా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని మాట్లాడుతూ.. వరుసగా మూడు చాప్టర్‌ల ప్రారంభం పట్ల హర్షం వెలిబుచ్చారు. “మాటా” రెగ్యులర్ మెంబర్‌షిప్ ఉచితంగా ఇస్తోందని తెలిపారు. ఐదేళ్లపాటు చెల్లుబాటయ్యే $25 విలువైన గిఫ్ట్‌ను కూడా అందిస్తోంది. డిసెంబరు 31లోపు సభ్యత్వాన్ని నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. https://mata-us.org/mata_membership వెబ్‌సైట్ సందర్శించవల్సిందిగా కోరారు.
👉 – Please join our whatsapp channel here –