భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు మలయాళ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్. ప్రస్తుతం ఆయన..లిజో జోష్ పెల్లిస్సేరి దర్శకత్వంలో ‘మలైకోటై వాలిబన్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, పోస్టర్లు, పాటలకి మంచి స్పందన లభించింది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న రానుంది. ఈ సందర్భంగా ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది చిత్రబృందం. క్రిస్మస్ సందర్భంగా సినిమాలోని కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. చుట్టూ ప్రజలు..మధ్యలో మోహన్‌లాల్…ఉన్న ఆ పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ చిత్రంలో సోనాలి కులకర్ణి కీలకపాత్ర పోషిస్తోంది. షిబు బేబి జాన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కొత్త అవతారంలో కనువిందు చేసేందుకు మోహన్‌లాల్ సిద్ధంగా ఉన్నారు.
👉 – Please join our whatsapp channel here –