నాగ చైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‍గా నటిస్తోంది. అయితే చైతు మత్స్యకారుడిగా కనిపించనున్న ఈ చిత్రం వాస్తవానికి రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించారు. 2018లో గుజరాత్‌కు చేపట వేటకు వెళ్లిన శ్రీకాకుళం, విజయనగరంకు చెందిన 22 మంది మత్స్యకారులు అనుకోకుండా పాకిస్థాన్ దళాల చేతికి చిక్కారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం చర్చలు జరపడంతో సుమారు రెండున్నరేండ్ల తర్వాత పాక్ వారిని విడిచిపెట్టింది. దీంతో జాలర్లు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ యథార్థ ఘటన ఆధారంగానే ‘తండేల్’ మూవీ తెరకెక్కుతోంది. ఇక రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందని గీతా ఆర్ట్స్ వెల్లడించింది. సముద్రం ఒడ్డున ఓడల మధ్య నాగచైతన్య నడుచుకుంటూ వెళుతున్నట్టుగా ఉన్న ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ‘సముద్రం మధ్య ఉత్కంఠ భరితమైన షెడ్యూల్‍ను తండేల్ టీమ్ మొదలు పెట్టింది. షూటింగ్ జరుగుతోంది’ అని గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది. త్వరలోనే మరిన్ని ఎగ్జైటింగ్ అప్‍డేట్స్ ఇస్తామని పేర్కొంది.
👉 – Please join our whatsapp channel here –