అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాన్సన్ కౌంటీలో మంగళవారం నాడు హైవే 67పై జరిగిన దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన ఆరుగురిలో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ పిన్ని-బాబాయి, వారి కుమార్తె, మనవడు, మనవరాలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. క్రిస్మస్ సందర్భంగా టెక్సాస్ నుండి అట్లాంటా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను, క్షతగాత్రులను ఫోర్ట్‌వర్త్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరికి తానా కోశాధికారి కొల్లా అశోక్‌బాబు, ఫౌండేషన్ కోశాధికారి పోలవరపు శ్రీకాంత్ సంస్థ తరఫున అవసరమైన సాయాన్ని అందిస్తున్నారు.
https://www.fox4news.com/news/6-killed-3-hurt-in-head-on-crash-on-u-s-hwy-67-in-johnson-county