చాలారోజుల తర్వాత రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయ ం కూడా భారీగా పెరిగింది. ఆదివారం ఒక్కరోజే 63,519 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రూ.5.05 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు టీటీడీ తెలిపింది.
అదేరోజు 26,424 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 23 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కాగా.. జనవరి 1 వరకు కొనసాగనున్నాయి. తిరుమల శ్రీవారికి దాదాపు ఒకటి రెండు నెలలుగా ఒక్కరోజు ఆదాయం రూ.5 కోట్లు దాటలేదు. ఆదివారమే మళ్లీ ఆ మార్క్‌కు చేరుకున్నది. తిరుమలలోని కపిలేశ్వరస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం తెప్పోత్సవం కనుల పండువగా జరిగింది.
👉 – Please join our whatsapp channel here –