RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీనికి భారీ స్పందన రావడంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. ఛార్జీ చెల్లించి టికెట్ కొన్న మగవారికి సీటు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో మగవారి కోసం ప్రత్యేక బస్సులు నడిపే దిశగా TSRTC అడుగులు వేస్తోంది. అలాగే వృద్ధుల(పురుషులు)కు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపుపైనా కసరత్తు చేస్తోంది.
👉 – Please join our whatsapp channel here –