Videos

సలార్ నుంచి ‘వినరా’ సాంగ్

సలార్ నుంచి ‘వినరా’ సాంగ్

ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమాను రూపొందించాడు. హోంబలే ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. చాలా రోజుల తరువాత ఆడియన్స్ తన నుంచి ఆశించే మాస్ కంటెంట్ తో ప్రభాస్ వచ్చాడు. ఈ నెల 22వ తేదీన విడుదలైన ఈ సినిమా, వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తూ వెళుతోంది.

ఈ కథ హీరో ప్రభాస్ .. అతని స్నేహితుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పుడు ఈ ఇద్దరి స్నేహానికి సంబంధించిన ఎపిసోడ్ తోనే ఈ కథ మొదలవుతుంది. అలాంటి వీరి స్నేహంపై ఎమోషన్స్ తో కూడిన ఒక సాంగ్ ఉంది. ఆ పాటనే కొంతసేపటి క్రితం విడుదల చేశారు.

‘ వినరా .. ఈ పగలు .. వైరం మధ్యన త్యాగంరా, వినరా రగిలే మంటల మధ్యన మంచేరా, వినరా మరిగే గరళం మధ్యన జీవం రా’ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ రెండు పాత్రలకి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ పాట .. సున్నితమైన భావోద్వేగాలతో ప్రేక్షకులకు పట్టుకుంటుంది. రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాట, ప్రధానమైన కథాంశాన్ని ఆవిష్కరిస్తుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z