రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ (Raghuram Rajan) ఇటీవల తన వృత్తి జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆర్‌బీఐ గవర్నర్ (RBI Governor)గా తాను అందుకున్న జీతభత్యాలను పంచుకున్నారు. యూట్యూబర్ రాజ్ షమానీ నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో రాజన్ ఈ వివరాలను బయటపెట్టారు.
‘ఆర్‌బీఐ గవర్నర్లకు ఇచ్చే వేతనాలు ఎలా ఉంటాయి?’ అని యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు రాజన్ బదులిస్తూ.. ‘‘ఇప్పుడు ఆర్‌బీఐ గవర్నర్ల వేతనాలు (Salary) ఎలా ఉన్నాయో నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఏడాదికి రూ.4లక్షల జీతం తీసుకున్నా. ఇక కేంద్ర బ్యాంక్ గవర్నర్‌గా నాకు అందిన సదుపాయాల్లో పెద్ద ఇంటిని కేటాయించారు. అది కూడా ముంబయిలోని మలబార్ హిల్స్‌లో అంబానీ ఇంటికి కొంచెం దూరంలోనే’’ అని వెల్లడించారు.
కేబినెట్ సెక్రటరీతో సమాన హోదాలో ఆర్‌బీఐ గవర్నర్‌కు వేతనాలు, ఇతర సదుపాయాలు కల్పిస్తారని రాజన్ తెలిపారు. ‘‘ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆర్‌బీఐ మాజీ గవర్నర్లకు సదుపాయాలు ఉండవు. అయితే వైద్య సదుపాయాలు కల్పిస్తారు’’ అని తెలిపారు. ఆర్‌బీఐ గవర్నర్ పదవి నుంచి దిగిపోయిన తర్వాత తనకు ఫుల్‌టైమ్ ఉద్యోగం లభించిందని తెలిపారు.
రఘురామ్ రాజన్ 2013 నుంచి 2016 వరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్‌కు గవర్నర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత షికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరారు.
👉 – Please join our whatsapp channel here –