Politics

కేఏపాల్ కోరిక తీరుతుందా?

కేఏపాల్ కోరిక తీరుతుందా?

ప్రజాశాంతి పార్టీలోకి పవన్‌ కల్యాణ్‌ వస్తే ఆయన్ను ఏపీకి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని కేఏ పాల్‌ అన్నారు. విశాఖలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణాలో బీజేపీతో కలిసి పోటీ చేసిన జనసేన పార్టీ చిత్తుగా ఓడిపోయిందని, అయినా సరే ఆ పార్టీ నాయకుడైన పవన్‌ కల్యాణ్‌ని తాను సాదరంగా ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నానన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే జనసేనకు 24 సీట్లు మాత్రమే ఆఫర్‌ చేసిందని, తానైతే 48 సీట్లు జనసేనకు, సీపీఐ, సీపీఎంలకు మరో 12 సీట్లు ఇచ్చి, మొత్తం 60 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటానన్నారు. రాష్ట్రంలో 90 శాతం తన వర్గం ఓట్లే ఉన్నాయని పాల్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z