ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగబోతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున పీకే పని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవ్యపు అధికార వైసీపీ పార్టీ పార్టీ ఇంచార్జులను మార్చడంతో పాటు చాలా మంది సిట్టింగులకు టికెట్లు కట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగానే YSRTP చీఫ్ వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్గా నియమించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ప్రకటించి.. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనం అంటూ అప్పట్లో జోరుగా చర్చ నడిచింది. రాహుల్, సోనియా గాంధీలతోనూ షర్మిల భేటీ అయ్యారు. పలుసార్లు డీకే శివకుమార్ను సైతం కలిశారు. అయితే పలు కారణాలతో కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనం ఆగిపోయింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి.. అధికారాన్ని చేపట్టింది. ఇదే జోష్లో ఏపీలోనూ సత్తా చాటాలని ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.
వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురుగా షర్మిలకు ఏపీలో మంచి ఫాలోయింగ్ ఉందని పార్టీ పెద్దలు నమ్ముతున్నారు. షర్మిలను ఏపీ అధ్యక్షురాలిగా చేస్తే… పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు. వైసీపీలో ఎక్కువ మంది కాంగ్రెస్ శ్రేణులే ఉన్న నేపథ్యంలో, షర్మిలకు బాధ్యతలను అ్పగిస్తే ఆ పార్టీ ఓట్లు కాంగ్రెస్ కు చీలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.
👉 – Please join our whatsapp channel here –