యంగ్ హీరో తేజ సజ్జ (Teja sajja) నటిస్తోన్న సినిమా ‘హను-మాన్’ (Hanu Man). ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. కొన్ని రోజులుగా వారానికో అప్‌డేట్‌ను అందిస్తోన్న చిత్రబృందం నేడు కూడా దీనికి సంబంధించిన ఓ వార్తను వెల్లడించింది. ఈ సినిమాలో రవితేజ (Ravi teja) భాగమైనట్లు తెలిపింది.
ఇప్పటికే పలు చిత్రాల్లో తన వాయిస్ ఓవర్‌తో రవితేజ అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘హను-మాన్’లో మరోసారి తన వాయిస్‌తో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో కోటి అనే కోతి పాత్రకు ఆయన వాయిస్ అందించనున్నారు. ఆ విషయాన్ని తెలుపుతూ మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. రవితేజ ఈ సినిమాలో భాగం కావడంతో ఎంటర్‌టైన్‌మెంట్ పదిరెట్లు పెరగనున్నట్లు తెలిపింది. ఇటీవల విడుదల చేసిన ‘హను-మాన్’ ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అందులోని గ్రాఫిక్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విజువల్ వండర్ అనే కామెంట్స్ వినిపించాయి. దీంతో మిలియన్ల వ్యూస్‌తో సోషల్ మీడియాలో అది ట్రెండ్‌ను సృష్టించింది.
అంజనాద్రి అనే ఓ కల్పిత ప్రదేశం నేపథ్యంలో సాగే చిత్రమిది. కథానాయకుడు హనుమంతుడి శక్తుల్ని పొంది అంజనాద్రి కోసం ఎలా పోరాటం చేశాడనే కథాంశంతో రూపొందుతోంది. తెలుగుతో పాటు 11 భాషల్లో విడుదల కానుంది. ఇందులో తేజ సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ ఓ కీలకపాత్ర పోషించనున్నారు. అలాగే కోలీవుడ్ నటుడు వినయ్ రాయ్ విలన్ కనిపించనున్నారు.
👉 – Please join our whatsapp channel here –