నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. డిసెంబరు 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1న ఉదయం 5 గంటల వరకు ఓఆర్‌ఆర్, పీవీ ఎక్స్‌ప్రెస్ వేను మూసివేయనున్నట్లు తెలిపారు. కేవలం విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు చెప్పారు. శిల్పా లే అవుట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్‌పేట్, మైండ్ స్పేస్, సైబర్ టవర్, ఫోరం మాల్, జేఎన్టీయూ, ఖైతలాపూర్, బాలానగర్ ఫ్లైఓవర్లు, దుర్గం చెరువు తీగల వంతెనను 31 వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నట్లు వెల్లడించారు. క్యాబ్, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలను వాట్సప్ నెంబర్ 94906-17346కు ఫిర్యాదు చేయవచ్చనని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
👉 – Please join our whatsapp channel here –