Business

కొవిడ్‌ అడ్వాన్స్‌ సదుపాయాన్ని నిలిపివేసిన ఈపీఎఫ్‌ఓ-వాణిజ్య వార్తలు

కొవిడ్‌ అడ్వాన్స్‌ సదుపాయాన్ని నిలిపివేసిన ఈపీఎఫ్‌ఓ-వాణిజ్య వార్తలు

* చాట్‌జీపీటీతో పోలిస్తే గ్రోక్ ఏఐ ఖ‌రీదైన‌ది!

ఎల‌న్ మ‌స్క్ ప్ర‌వేశ‌పెట్టిన సొంత ఏఐ చాట్‌బాట్ గ్రోక్ ఏఐ (GrokAI) ఎంపిక చేసిన యూజ‌ర్ల‌కు అందుబాటులోకి రాగా ప్ర‌స్తుతం భార‌త్‌లోనూ అందుబాటులో ఉంది. అయితే ఈ ఏఐ చాట్‌బాట్‌ను కేవ‌లం ఎక్స్ ప్రీమియం+ యూజ‌ర్లు మాత్ర‌మే యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంది. గ్రోక్ఏఐ స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్‌ను వెబ్ బ్రౌజ‌ర్‌లో యాక్సెస్ చేసుకోవాలనే వివ‌రాల‌ను చూస్తే..ఎక్స్ హోమ్‌పేజ్ ఓపెన్ చేసి లాగిన్ అవ‌గానే సైడ్ మెనూలో గ్రోక్ పేరిట న్యూ ట్యాబ్ క‌నిపిస్తుంది.మీ ఫోన్ యాప్ ద్వారా ఎక్స్‌ను యాక్సెస్ చేస్తే ట్విట్ట‌ర్‌లో మీ ప్రొఫైల్ పిక్‌పై క్లిక్ చేయ‌గానే సైడ్ మెనూకు వెళ్లి గ్రోక్ ట్యాబ్‌ను లొకేట్ చేస్తారు. ఎక్స్ ప్రీమియం ప్ల‌స్ స‌బ్‌స్క్రైర్ అయితే మీరు ఈ ట్యాబ్‌పై క్లిక్ చేసి నేరుగా చాట్‌బాట్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ప్రీమియం ప్ల‌స్ స‌బ్‌స్క్రైబ‌ర్ కానివారు కింద క‌నిపించే అప్‌గ్రేడ్ టూ ప్రీమియం+ ట్యాబ్ ద్వారా అప్‌గ్రేడ్ కావ‌చ్చు.గ్రోక్ఏఐ వినియోగించుకునేందుకు ప్రీమియం+ స‌బ్‌స్క్రైబ్ చేయాల‌నుకుంటే ఈ ట్యాబ్‌పై క్లిక్ చేసి అక్క‌డ ఇచ్చే స్టెప్స్‌ను అనుస‌రించ‌వచ్చు. భార‌త్‌లో ప్రీమియం+ స‌బ్‌స్క్రిప్ష‌న్ నెల‌కు రూ. 1300 కాగా, వెబ్ వెర్ష‌న్‌కు ఏడాదికి రూ. 13,600. మొబైల్ యాప్‌లో ప్రీమియం ప్లాన్ ఏటా రూ. 22,900 కాగా నెల‌కు రూ. 2299 చార్జ్ చేస్తారు. చాట్‌జీపీటీతో పోలిస్తే గ్రోక్ ఏఐ ఖ‌రీదైన‌ది కావ‌డం విశేషం. ఓపెన్ఏఐ చాట్‌బాట్ మొబైల్ యాప్‌పై నెల‌కు రూ. 1,999 చార్జ్ చేస్తోంది.

కొవిడ్‌ అడ్వాన్స్‌ సదుపాయాన్ని నిలిపివేసిన ఈపీఎఫ్‌ఓ

కొవిడ్‌ సమయంలో తీసుకొచ్చిన కొవిడ్‌ అడ్వాన్స్‌ (Covid advance) సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిలిపివేసింది. కొవిడ్‌ వేళ ఉద్యోగులు తమ వైద్య, ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈపీఎఫ్‌ఓ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. హెల్త్‌ ఎమర్జెన్సీ జాబితా నుంచి కొవిడ్‌-19ను ప్రపంచ ఆరోగ్య సంస్థ  తప్పించిన నేపథ్యంలో ఈ సదుపాయాన్ని నిలిపివేస్తూ ఈపీఎఫ్‌ఓ ఈ నిర్ణయం తీసుకుంది. వారం క్రితం ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ఈపీఎఫ్‌ఓ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలోనే వెలువడనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంటే ఇకపై పీఎఫ్‌ చందాదారులు కొవిడ్‌ అడ్వాన్స్‌ పేరిట భవిష్య నిధి నుంచి సొమ్ములను ఉపసంహరించుకోవడం సాధ్యపడదు. ప్రస్తుతం ఉమాంగ్‌ యాప్‌లోకి వెళ్లి కొవిడ్‌ అడ్వాన్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే ‘సర్వీసు అందుబాటులో లేదు’ అనే సందేశం కనిపిస్తోంది.కొవిడ్‌ కాలంలో తీసుకొచ్చిన ఈ నాన్‌ రిఫండబుల్‌ అడ్వాన్స్‌ సదుపాయం చాలా మందికి ఉపకరించినా.. కొందరు మాత్రం వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారు. ఈ సదుపాయాన్ని ఇన్నేళ్ల పాటు కొనసాగించడం వల్ల చాలామంది రిటైర్‌మెంట్‌ సేవింగ్స్‌పై ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు. 2020 మార్చి 28న తీసుకొచ్చిన కొవిడ్ అడ్వాన్స్‌ సదుపాయాన్ని 2.2 కోట్ల మంది వినియోగించుకున్నారు. రూ.48 వేల కోట్లు కొవిడ్‌ అడ్వాన్స్‌ రూపేణ ఉపసంహరించుకున్నారని ఈపీఎఫ్‌ వార్షిక నివేదిక ద్వారా వెల్లడైంది.

* ఐసీఐసీఐ ప్రూ లైఫ్ పెద్ద మొత్తంలో జీఎస్టీ నోటీసులు 

ప్రముఖ బీమా సంస్థ ఐసీఐసీఐ ప్రూ లైఫ్ పెద్ద మొత్తంలో జీఎస్టీ నోటీసులు అందుకుంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తక్కువ జీఎస్టీ చెల్లించిన కారణంగా పన్ను అధికారులు రూ. 270 కోట్లను డిమాండ్ చేస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ బుధవారం వెల్లడించింది. మహారాష్ట్ర గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) అథారిటీ 2017-18కి వర్తించే వడ్డీ, జరిమానాతో కలిపి కట్టాలని తెలిపింది. చెల్లించాల్సిన మొత్తం రూ. 269.86 కోట్లలో రూ. 119.56 కోట్లు జీఎస్టీ, రూ. 138 కోట్ల వడ్డీ, రూ. 11.95 కోట్ల పెనాల్టీ ఉన్నాయని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి నిర్దేశించిన గడువులోగా అప్పీల్‌ను దాఖలు చేయనున్నట్టు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తన బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది.

మీ ధైర్యానికి అభినంద‌న‌లు..అలా అడ‌గ‌టంలో త‌ప్పేముంది..?

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌ర‌చూ ప‌లు స్ఫూర్తిదాయ‌క‌, వినోదాత్మ‌క పోస్ట్‌లు, ఫొటోలు, వీడియోల‌ను షేర్ చేసే కార్పొరేట్ దిగ్గ‌జం ఆనంద్ మ‌హీంద్ర (Anand Mahindra) మ‌రో ఆస‌క్తిక‌ర పోస్ట్‌తో ముందుకొచ్చారు. లేటెస్ట్‌గా ఓ ఎక్స్ యూజ‌ర్ ఆనంద్ మ‌హీంద్ర దృష్టిని ఆక‌ర్షించారు. పారిశ్రామిక దిగ్గ‌జం షేర్ చేసిన ఓ పోస్ట్‌లో యూజ‌ర్ కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కామెంట్‌లో స‌ద‌రు వ్య‌క్తి సార్‌..మ‌హీంద్ర గ్రూప్ షేర్స్ కొనుగోలు చేసేందుకు నాకు రూ. ల‌క్ష అవ‌స‌రం అని రాసుకొచ్చాడు. ఈ కామెంట్‌పై ఆనంద్ మ‌హీంద్ర స‌ర‌దాగా రియాక్ట‌ర‌య్యారు. మీ ధైర్యానికి అభినంద‌న‌లు..అలా అడ‌గ‌టంలో త‌ప్పేముంది..? అంటూ స్పందించారు. వీరి సంభాష‌ణ సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వ‌గా, మ‌హీంద్రా స‌ర‌దాగా తీసుకున్న తీరును ప‌లువురు ప్ర‌శంసించారు.ఆతిధ్య రంగ వ్యాపారి రోహిత్ ఖ‌ట్ట‌ర్ ఇటీవ‌ల గోవాలో న్యూ రెస్టారెంట్ తెర‌వగా, దాన్ని ప్ర‌శంసిస్తూ మ‌హీంద్రా షేర్ చేసిన పోస్ట్‌లో ఓ యూజ‌ర్ చేసిన ఊహించ‌ని ఈ కామెంట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

మారుతీ సుజుకీ బ్రెజా సేల్స్‌లో సరికొత్త మైలురాయి

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti suzuki) తీసుకొచ్చిన కాంపాక్ట్‌ ఎస్‌యూవీ బ్రెజా (brezza) సరికొత్త మైలురాయిని అందుకుంది. 2016 మార్చిలో విడుదలైన ఈ కారు ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్లు అమ్ముడైంది. లాంచ్‌ అయిన 94 నెలల్లో ఈ మైలురాయిని అందుకుంది. అంతేకాదు 2023-24 ఆర్థిక సంవత్సరంలో బెస్ట్‌ సెల్లింగ్‌ కారు గానూ నిలిచింది.2016 మార్చి నుంచి 2023 నవంబర్‌ వరకు 9.96 లక్షల యూనిట్లను మారుతీ సుజుకీ విక్రయించింది. నవంబర్‌ నాటికి 3,392 యూనిట్ల దూరంలో నిలిచింది. డిసెంబర్‌ తొలి వారంలో ఆ మైలురాయిని బ్రెజా చేరుకున్నట్లు ఆటో కార్‌ ఇండియా తెలిపింది. విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు నెలకు సగటున 13,921 యూనిట్లను మారుతీ విక్రయించింది.ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్‌ సేల్స్‌ విషయంలో అగ్రగామిగా ఉండేది. ఈ ఏడాది మార్చిలో బ్రెజాలో సీఎన్‌జీ వెర్షన్‌ను మారుతీ తీసుకొచ్చింది. దీంతో టాటా నెక్సాన్‌ను బ్రెజా అధిగమించేందుకు దోహదపడింది. ప్రస్తుతం మార్కెట్లో టాటా నెక్సాన్‌, హోండా ఎలివేట్‌, ఫోక్స్‌వ్యాగన్‌ టైగన్‌, స్కోడా కుషక్‌, హ్యుందాయ్‌ క్రెటా బ్రెజాకు గట్టి పోటీ ఇస్తున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z