కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య- జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోనే మోస్ట్ అడోరబుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే.. ఈ జంట టాప్ 5 లో ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడు బయట కనిపించినా.. జంటగా, సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీలకు ప్రైవసీ లేకుండా పోతుంది. ఒక వారం రోజులు భార్యాభర్తలు దూరం గా ఉన్నా.. బర్త్ ఒకచోట ఉండి.. భార్య వేరోచోట ఉన్నా కూడా ఆ జంట విడిపోయినట్లు వార్తలు సృష్టిస్తున్నారు. గత కొన్నిరోజులుగా జ్యోతిక ముంబైలో మకాం పెట్టింది. సూర్య మాత్రమే చెన్నైలో ఉండడంతో వీరిద్దరూ విడిపోయారని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారని వార్తలు పుట్టించారు. అయితే ఈ ఏడాదే సూర్య ఒక కక్లారిటీ ఇచ్చాడు. పిల్లల చదువుల రీత్యా తాము ముంబైలో ఉంటున్నామని తెలిపాడు. తాను మాత్రం షూటింగ్స్ నిమిత్తం చెన్నై టూ ముంబై తిరుగుతున్నట్లు చెప్పాడు.
ఇక ఈ విడాకుల రూమర్స్ ఎక్కువ కావడంతో జ్యోతిక వీటిపై స్పందించింది. ఇటీవల ఒక మీడియాతో మాట్లాడిన ఆమె తానెందుకు ముంబైలో ఉంటున్నానో చెప్పుకొచ్చింది. తన అమ్మానాన్నలను చూసుకోవడానికి తాను ముంబైలో ఉంటున్నట్లు తెలిపింది. ” సూర్య చాలా మంచి వ్యక్తి. ఆయన నాకెప్పుడూ సపోర్ట్ గా ఉంటారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ప్రస్తుతం ముంబైలో ఉంటున్న మాట నిజమే. అది కేవలం మా అమ్మానాన్న కోసమే. వారు ముంబైలోనే ఉంటారు. వారికి ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు. ఒక కూతురిగా నేనే వారిని చూసుకోవాలి. వారికోసం మాత్రమే ముంబైలో ఉంటున్నాను. అంతేకాని సూర్యతో విడిపోలేదు” అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆ పుకార్లకు చెక్ పడినట్లు అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం జ్యోతిక సైతం వరుస సినిమాలతో బిజీగా మారింది. సపోర్టివ్ పాత్రలతో అదరగొడుతుంది. త్వరలోనే ఆమె నటించిన కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
👉 – Please join our whatsapp channel here –