హిందువులు అత్యంత పవిత్రంగా ఆచరించే వైకుంఠ ఏకాదశి వేడుకలను అమెరికాలోని న్యూజెర్సీలో ఘనంగా జరుపుకొన్నారు. హిందూ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీలోని సాయిదత్తపీఠం శ్రీశివ విష్ణు దేవాలయం వేడుకలకు వేదికైంది. ఉదయం నుంచే స్థానిక ఎన్నారై భక్తులు హరి నామాన్ని స్మరించుకుంటూ ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యతను సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి భక్తులకు వివరించారు. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగు పెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారని ఆయన తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –