Movies

డీజీపీతో ఆర్జీవీ భేటీ

డీజీపీతో ఆర్జీవీ భేటీ

ఓ టీవీ చానెల్‌ డిబేట్‌లో పబ్లిక్‌గా తన తలకు కోటి రూపాయలు వెల కట్టారని, ఇలాంటి హత్యా రాజకీయాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ( Ram Gopal Varma) ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ(AP DGP) రాజేంద్రనాథ్‌రెడ్డికి బుధవారం ఫిర్యాదు చేశారు. ‘వ్యూహం’ (Vyuham) సినిమా నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌తో కలిసి టీడీపీకి చెందిన కొలికిపూడి శ్రీనివాస్‌, ఓ టీవీ యాంకర్‌ సాంబశివరావు, దాని యజమాని బీఆర్‌ నాయుడుపై ఫిర్యాదు చేశారు.

మంగళవారం రాత్రి ఓ టీవీ డిబేట్‌(TV Debet) లో పాల్గొన్న కొలికిపూడి శ్రీనివాస్‌ తనను చంపితే కోటి రూపాయలు ఇస్తానని చెప్పినట్లు ఆర్జీవీ పేర్కొన్నారు. ఇప్పటి వరకు తనను చంపేందుకు ఎవరూ సుఫారీ ఇవ్వలేదని, మొదటిసారి ఇలాంటి వార్తలు రావడం తనను కలవరపెట్టిందని అన్నారు. ఇలాంటి హత్యారాజకీయాలను వెంటనే నివారించాలని డీజీపీని కోరారు.

‘వ్యూహం’ అనే సినిమా తన మదిలోంచి వచ్చిన ఒక పొలిటికల్‌ కాన్సెప్ట్‌ అని, ఏ తప్పు చేయనప్పుడు వారెందుకు భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హత్యా కాంట్రాక్ట్‌లు పబ్లిక్‌గా ఇవ్వడం చూస్తే, టెర్రరిస్టులు సైతం షాక్‌ అవుతారని ఆర్జీవీ వెల్లడించారు. ఆర్జీవీ ఫిర్యాదు మేరకు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పినట్లు నిర్మాత కిరణ్‌కుమార్‌ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z