శబరిమల దేవాలయాన్ని నేటి నుంచి మూసివేయనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. రాత్రి 11 గంటలకు మండల మహోత్సవం పూర్తయిన అనంతరం ఆలయ తలుపులను మూసివేయనున్నారు. తిరిగి మకరవిళక్కు మహోత్సవం కోసం ఈనెల 30న సాయంత్రం 5.00 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. అప్పటి నుంచి మకరజ్యోతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జ్యోతి దర్శనం జనవరి 15 సాయంత్రం 6.36 గంటలకు ఉండనుంది. కాగా, మరికొద్దిగంటల్లో ఆలయం మూతపడనుండగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది.
👉 – Please join our whatsapp channel here –