Politics

జగన్‌ కాన్వాయ్‌పై రాయి విసిరిన ఘటన

జగన్‌ కాన్వాయ్‌పై రాయి విసిరిన ఘటన

సీఎం జగన్‌ కాన్వాయ్‌పై పులివెందుల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి రాయి విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, వైకాపా నేతలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నంచేయగా బాధితుడి ద్వారా బయటకు వచ్చింది. ఈ నెల 24న సీఎం జగన్‌ ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవానికి పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురానికి వెళ్లారు. అక్కడ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సమీపంలోని హెలిప్యాడ్‌కు కారులో బయలుదేరారు. ఆ సమయంలో గురిజాల గ్రామానికి చెందిన అప్పయ్య సీఎం కాన్వాయ్‌పైకి రాయి విసిరారు. అది ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ వాహనంపై పడింది. గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులపాటు తీవ్రంగా కొట్టినట్లు తెలిసింది. ఈ వ్యవహారం బయటికి రాకుండా జాగ్రత్తపడ్డారు. చివరకు వైకాపా నేతలు జోక్యం చేసుకుని అప్పయ్యను విడిపించారు. దివ్యాంగుడైన అప్పయ్య పింఛను కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడిచినా పింఛను రాకపోవడంతో విసుగు చెంది సీఎం కాన్వాయ్‌పైకి రాయి విసిరినట్లు తెలిసింది. బుధవారం ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z