వస్త్రం.. కళా అస్త్రం
సూత్ర సంతతి.. వినగానే కొత్తగా అనిపిస్తుంది. మనకు మానవ సంతతి మాత్రమే తెలుసు. ముత్తాత, తాత, నాన్న, మనం, మన పిల్లలు.. అంతే! ఆమాటకొస్తే వస్ర్తానికి సైతం ఓ ఘనమైన వారసత్వం ఉంటుంది. ఆ వంశవృక్షాన్ని ఎవరూ రికార్డు చేయకపోవడం వల్ల.. మనిషి నిర్లక్ష్య-నిర్లిప్తతల ఫలితంగా కొన్ని అరుదైన దారపు పోగులు కనిపించకుండా పోతున్నాయి.
అపురూపమైన వస్త్రకళలు అంతరించిపోతున్నాయి. ఈ దుస్థితిని నివారించి.. ప్రతి పోగునూ జాగ్రత్తగా సంరక్షించుకోవాలన్నదే ‘సూత్ర సంతతి’ లక్ష్యమని చెబుతారు ఆ సంస్థ క్యూరేటర్ లవీనా బల్డోట. ఇప్పటికే నూట ఇరవై అయిదుకుపైగా వస్త్ర ఆధారిత కళారూపాలను సేకరించారామె. వాటిని ముంబైలోని ఓ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు పెట్టారు. రవివర్మ చిత్రాలను స్ఫూర్తిగా తీసుకొని.. చీరలపై నేసిన చిత్రాలూ అందులో ఉన్నాయి.
👉 – Please join our whatsapp channel here –