Food

హైదరాబాద్‌లో 99కే అన్‌లిమిటెడ్‌ బిర్యానీ!

హైదరాబాద్‌లో 99కే అన్‌లిమిటెడ్‌ బిర్యానీ!

బిర్యానీ.. ఈ పేరు వింటే చాలు నోట్లో నీళ్లు ఊరుతాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, సాధారణంగా ఒక ప్లేట్‌ బిర్యానీ ఎంత ఉండొచ్చు..? పెద్ద పెద్ద హోటల్స్‌లో అయితే ప్లేట్‌ బిర్యానీ రూ.250 నుంచి రూ.300 వరకూ ఉంటుంది. ఇక రోడ్‌సైడ్‌ బండ్లపై అయితే రూ.100, రూ.120 వరకూ ఉంటుంది. అదికూడా ఒకరికి సరిపోదు. ఇంకొంచె అండుగుతే మాత్రం లేదని ముఖం మీదే చెప్పేస్తుంటారు. అయితే, ఒకచోట మాత్రం కేవలం రూ.99కే చాలా టేస్టీగా ఉండే అన్‌లిమిటెడ్‌ (Unlimited Biryani) బిర్యానీ దొరుకుతోంది. షాక్‌ అవుతున్నారు కదూ..! ‘ఏంటీ రూ.99కే అదికూడా అన్‌లిమిటెడ్‌ బిర్యానీ..?’ అని అనుకుంటున్నారు కదా..! మీరు విన్నది నిజమే. ఇంతకీ అది ఎక్కడనుకుంటున్నారు. మన హైదరాబాద్‌లోనే (Hyderabad).

నగరం నడిబొడ్డున ఉన్న అమీర్‌పేట్‌ (Ameerpet) ప్రాంతం తెలియని వారు ఉండరు. చుట్టుపక్కల రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇది బాగా సుపరిచితం. ఎందుకంటే ఇక్కడ కోచింగ్‌ సెంటర్లు, బుక్‌ స్టాల్స్‌, హాస్టల్స్‌ ఎన్నో ఉంటాయి. గ్రాడ్యుయేషన్‌ స్టూడెంట్స్‌ ఎక్కువగా ఈ ప్రాంతంలోనే హాస్టల్స్‌లో ఉంటూ జాబ్‌ సర్చింగ్స్‌ చేసుకుంటుంటారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే రూ.99కే అదిరిపోయే బిర్యానీ దొరుకుతోంది. మైత్రివనం దగ్గర పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఉంది. ఆ బ్యాంక్‌కు ఎదురుగా ‘మధు బిర్యానీ సెంటర్‌’ (Madhu Biryani Centre) అని ఓ తోపుడు బండి కనిపిస్తుంది. అక్కడ కేవలం రూ.99కే తిన్నంత బిర్యానీ అందిస్తున్నారు. చికెన్‌, ఎగ్‌, చికెన్‌ ప్రై పీస్‌ బిర్యానీ వీళ్ల దగ్గర లభిస్తోంది.

ధర చూసి రేటు తక్కువ కద టేస్ట్‌ ఎలా ఉంటుందో అని సందేహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్లు రుచి విషయంలో రాజీపడట్లేదు. ఎంతో రుచికరంగా ఉంటోందని అక్కడ తిన్న కస్టమర్లే చెబుతున్నారు. అందుకే మధ్యాహ్నం కాగానే ఈ బిర్యానీ కోసం జనం అక్కడ వాలిపోతున్నారు. లైన్లో నిల్చొని మరీ బిర్యానీ కోసం ఎగబడుతున్నారు. ఎంత తింటే అంత కడుపునిండా పెడుతున్నారు.

ఇక్కడ మరో విషయం గుర్తించుకోవాలి. పెడుతున్నారు కదా అని ఎక్కువగా పెట్టించుకుని వేస్ట్‌ చేశారో అంతే సంగతులు. ఫుడ్‌ వేస్ట్‌ చేసిన వారికి భారీగా ఫైన్‌ కూడా వేస్తారు. కొంచెం పడేసినా సరే రూ.200 వరకూ జరిమానా విధిస్తున్నారు. మంచి ఆలోచనే కద. తక్కువకి వచ్చింది, కావాల్సినంత పెడుతున్నారు అని కొందరు అతికి పోయి వేస్ట్‌ చేసేస్తుంటారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొనే ‘కడుపునిండా తినండి.. ఫుడ్‌ మాత్రం వేస్ట్‌ చేయకండి’ అన్న కాన్సెప్ట్‌తో ఈ సెంటర్‌ను పెట్టినట్లున్నారు.

‘నేను అన్‌లిమిటెడ్‌ బిర్యానీని లాంచ్‌ చేసినప్పుడు చాలా మంది కస్టమర్లు ఆహారాన్ని వేస్ట్‌ చేయడం చూశాను. అందుకే ఫుడ్‌ వేస్ట్‌ చేసే వాళ్లకి ఫైన్‌ వేయాలన్న ఆలోచని వచ్చింది. దీంతో అన్నం పడేసిన వారికి రూ.200 ఫైన్‌ వేస్తున్నా. ఇప్పటి వరకూ ఇద్దరు ముగ్గురికి మాత్రమే జరిమానా విధించాను’ అని యజమాని కె.మధు తెలిపారు. ఏదైతేనేమి బిర్యానీ తినాలనుకున్న వాళ్లు మాత్రం ఒక్కసారైనా ఇక్కడ టేస్ట్‌ చేయాల్సిందే అంటున్నారు జనాలు. ఇంకెందుకు ఆలస్యం రూ.99కే టేస్టీ, అన్‌లిమిటెడ్‌ బిర్యానీని మీరూ ఓ సారి టేస్ట్‌ చేయండి మరి.. గుర్తు పెట్టుకోండి ఫుడ్‌ అస్సలు వేస్ట్‌ చేయకూడదు..!

ఇక ధరల విషయానికొస్తే..

చికెన్ బిర్యానీ – రూ. 99
ఎగ్ బిర్యానీ – రూ. 79
చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ – రూ. 99
ఫుడ్‌ వేస్ట్‌ చేస్తే మాత్రం – రూ.200 ఫైన్‌

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z