Devotional

తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు

తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు

పవిత్రమైన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో 10 రోజుల పాటు ఉత్తర ద్వారా దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో డిసెంబర్ 23వ తేదీన తెల్లవారుజామున 1.45 గంటల నుండి భక్తులను వైకుంఠ ద్వారా దర్శనం కలిస్తుస్తోంది టీటీడీ.. అయితే, శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతోంది.. నాలుగు రోజులలో శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 2.7 లక్షలకు చేరింది.. జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనుండగా.. దర్శన టోకెన్లు కలిగిన భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. మరోవైపు, జనవరి 1వ తేదీ వరకు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.. జనవరి 1వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలుకు సిఫార్సు లేఖల స్వీకరణను కూడా రద్దు చేసింది టీటీడీ.. ఇక, నిన్న 71,488 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 19,137గా ఉంది.. శ్రీవారికి హుండీ ద్వారా భక్తులు రూ.4.17 కోట్ల కానుకలు సమర్పించినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z