విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA ) క్రిస్మస్ Annual టాయ్ & బ్లాంకెట్ డ్రైవ్ & డిస్ట్రిబ్యూషన్!
విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA ) ప్రతియేటా క్రిస్మస్ పండుగ సందర్బంగా వివిధ రాష్ట్రాలలో “టాయ్స్ మరియు బ్లాంకెట్స్” షెల్టర్ హోమ్స్ లో వున్నా స్త్రీ లకు మరియు పిల్లలకు డొనేట్ చేయడం తెలిసిన విషయమే. ఈ సంవత్సరం కూడా కాలిఫోర్నియా మరియు టెక్సాస్ రాష్ట్రాలలో “టాయ్స్ మరియు బ్లాంకెట్స్” పంపిణీ చేయడం జరిగింది. క్రిస్మస్ సందర్భంగా ఆ పిల్లల ముఖాల్లో సంతోషం, ఆనందం చూడడం జరిగింది.
ఫౌండర్ ప్రెసిడెంట్ ఝాన్సీ గారు మరియు ప్రెసిడెంట్ శైలజ కల్లూరి ఆధ్వర్యంలో కాలిఫోర్నియా లో శాక్రమెంటోలోని షెల్టర్ హోం లో WETA టీం ” రత్నమాల, విశ్వ , పూజ , రేఖ, హైమ , అనురాధ , జ్యోతి, చందన సుధా, సునీత ” పంపిణీ చేసారు. అలాగే టెక్సాస్ స్టేట్ లో డల్లాస్ నగరంలో గుడ్ Samaritan షెల్టర్ హోం లో WETA టీం “స్మృతి, ప్రతిమ, ప్రశాంతి మరియు చిన్నారులు సుదీప, సంహిత” పంపిణీ చేసారు.
👉 – Please join our whatsapp channel here –