Devotional

వటపత్ర శయనుడి అలంకరణతో యాదాద్రి నారసింహుడు

వటపత్ర శయనుడి అలంకరణతో యాదాద్రి నారసింహుడు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో పంచనారసింహుల స్వయంభూ ఆలయ వార్షిక అధ్యయన ఉత్సవాల్లో భాగంగా బుధవారం చేపట్టిన అలంకార సేవ వేడుకలు భక్తులకు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని కలిగించాయి. నాలాయిర దివ్యప్రబంధ పారాయణంతో ఉదయం వటపత్ర శయనుడి అలంకరణతో యాదాద్రి నారసింహుడు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రివేళ వైకుంఠ నాథుడి రూపం దాల్చి పరమపద ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఈ పర్వాలలో దేవస్థాన నిర్వాహకులు పాల్గొన్నారు. గురువారం నిర్వహించే ఆలయ దేవుడి అలంకార సంబరంతో ఆరు రోజుల అధ్యయన ఉత్సవాలు ముగుస్తాయని ఈవో రామకృష్ణారావు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z