అయోధ్యలో (Ayodhya Ram Temple) నూతనంగా నిర్మిస్తున్న రామాలయంలో 620 కిలోల బరువున్న గంటను అమర్చనున్నారు. తమిళనాడులో ప్రత్యేకంగా తయారైన ఈ గంటను ఆలయంలో నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం అమర్చనున్నారు. ప్రస్తుతం ఈ గంట అయోధ్య చేరుకుంది.
ఈ గంటపై జై శ్రీరాం అని రాసి ఉంది. మరోవైపు జనవరి 22న అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. కాగా, రామ లాలా విగ్రహాలను శిల్పులు గణేష్ భట్, అరుణ్ యోగిరాజ్, సత్యనారాయణ పాండే తయారు చేస్తున్నారు.
కాశీ నుంచి గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్, లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రాణ ప్రతిష్ఠా పూజను నిర్వహిస్తారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ప్రతిష్ఠాపన కార్యక్రమం అనంతరం విశ్వప్రసన్న తీర్థ జీ నేతృత్వంలో 48 రోజుల పాటు మండల పూజలు జరుగుతాయని ట్రస్ట్ పేర్కొంది.
👉 – Please join our whatsapp channel here –