Movies

హైదరాబాద్‌లో ‘సరిపోదా శనివారం’ హంగామా

హైదరాబాద్‌లో ‘సరిపోదా శనివారం’ హంగామా

‘హాయ్‌ నాన్న’తో ఈ ఏడాది మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు కథానాయకుడు నాని. ఆ సినిమా విజయాన్ని… విహారాన్ని ఆస్వాదించి అమెరికా నుంచి ఇటీవలే తిరిగొచ్చారు. వెంటనే కొత్త చిత్రం ‘సరిపోదా శనివారం’ కోసం రంగంలోకి దిగారు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో… డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రమిది. నాని సరసన కథానాయిక ప్రియాంక మోహన్‌ నటిస్తోంది. ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోసిస్తున్నారు. డి.వి.వి.దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు. బుధవారం నుంచి హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ చిత్రీకరణని ప్రారంభించారు. సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్‌లో కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలతోపాటు ప్రధాన తారాగణంపై టాకీ భాగాన్ని చిత్రీకరించనున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. ‘‘యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. నాని మాస్‌ అవతారంలో కనిపిస్తారు. తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని చెప్పాయి సినీ వర్గాలు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మురళి.జి, కూర్పు: కార్తీక శ్రీనివాస్‌, సంగీతం: జేక్స్‌ బిజోయ్‌, పోరాటాలు: రామ్‌ – లక్ష్మణ్‌.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z