ఏపీలో ప్రైవేట్ పాఠశాలలకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కాలపరిమితి 8 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 3 నుండి 8 ఏళ్ల గుర్తింపు కాలపరిమితి పెంపుదలపై 13 మంది రీజినల్ మరియు జిల్లా అధికారులకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.8 ఏళ్లకు గుర్తింపు పెంచుతూ ఇచ్చిన హైకోర్టు తీర్పు అమలు చేయకుండా యజమాన్యాలను ఇబ్బందులకు గురి చేయటంపై హైకోర్టులో పిటిషన్ వేసింది. యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫెడరేషన్ (UPEIF) హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో.. కోర్టు ధిక్కరణ కింద 13 మంది రీజినల్ మరియు జిల్లా అధికారులను ఇంప్లిడ్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
👉 – Please join our whatsapp channel here –