హైదరాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. న్యూ ఇయర్ వేడుకల సమీపిస్తున్న వేళ భారీ గ్రడ్స్ మూఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మూఠా వద్ద నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా 100 గ్రాముల ఎండీఎంఏ (MDMA)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా న్యూఇయర్ వేడుకలకు గోవా నుంచి డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ముగ్గురు అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణలో డ్రగ్స్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తామని, డ్రగ్స్ సరాఫరా చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మత్తు పదార్థాల వినియోగంలో పంజాబ్‌లా తెలంగాణ మారకుండా నిర్మూలించాల్సిన బాధ్యత పోలీసులుదేనని ప్రభుత్వం పేర్కొంది. అయినప్పటికీ అంతర్ రాష్ట్ర ముఠాలు విచ్చలవిడిగా నగరంలోకి డ్రగ్స్‌ను తీసుకురావటం గమనార్హం.
👉 – Please join our whatsapp channel here –