Movies

అంగన్‌వాడీ నిరసన కార్యక్రమంలో జానీ మాస్టర్‌

అంగన్‌వాడీ నిరసన కార్యక్రమంలో జానీ మాస్టర్‌

రామ్‌గోపాల్‌వర్మకు పవన్‌కల్యాణ్‌ అంటే ఎంత ఇష్టమో జగన్‌ అంటే నాకు అంతే ఇష్టమని సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ పేర్కొన్నారు. నెల్లూరులో అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరసనకు సంఘీభావంగా గురువారం శిబిరంలో పాల్గొన్నారు. పోరాటంలో అసువులు బాసిన సంగం మండలంలోని తరుణవాయి గ్రామానికి చెందిన రమణమ్మకు రూ.70 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతానన్న జగన్‌ మాట తప్పడం తగదన్నారు. ప్రసవం తర్వాత నా భార్య ఇద్దరు బిడ్డలతో ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు.. అటువంటిది ఎంతోమంది బిడ్డలను ఓర్పుతో ఆదరిస్తున్న అంగన్‌వాడీ తల్లుల న్యాయమైన కోరికలు తీర్చాలన్నారు. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్‌ మాట్లాడుతూ నా తల్లికి ముగ్గురు, నా భార్యకు ఇద్దరు బిడ్డలు కానీ అంగన్‌వాడీ తల్లులకు ఎంత మంది బిడ్డలు అంటే చెప్పలేమన్నారు. అలాంటి తల్లుల పట్ల నిర్దగా వ్యవహరించడమేమిటని ప్రశ్నించారు. సచివాలయం సిబ్బందితో అంగన్‌వాడీ కేంద్రాలు తీయిస్తున్న జగన్‌ మున్సిపల్‌ కార్మికుల సమ్మె చేస్తున్నారుగా కాలువలు కూడా తీయిస్తారా అని నిలదీశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z